ప్రజా పాలనలో అభివృద్ధికి పెద్దపీట
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
పెద్ద అంబర్ పేట్ 52 డివిజన్‌లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు
అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 10: కాంగ్రెస్ ప్రజాపాలనలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. మల్కాజి గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎల్బీనగర్ జోనల్, నాగోల్ సర్కిల్ పెద్ద అంబర్ పేట్ 52 డివిజన్ లో ఆర్ అండ్ బీ రూ. 13 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణాల పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి లు హాజరయ్యారు. పెద్ద అంబర్ పేట్ లోని అవసల వారి కుంట నుంచి చెక్ పోస్ట్ వరకు, అంబేద్కర్ యువజన నుంచి మునగనూరు మల్లన్న దేవాలయం వరకు అలాగే పెద్ద అంబర్ పేట్ నుంచి బలిజ గూడ వెళ్లే రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాపాలన, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు దోచుకునుడు దాచుకునుడు తప్పితే గత 10 ఏళ్లలో పెద్ద అంబర్ పేట్ అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పెద్ద అంబర్ పేట్ అభివృద్ధి కోసం రూ. 100 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పసుల రాజేందర్, సిద్ధంకి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పండుగల రాజు, వడ్డేపల్లి విజేందర్ రెడ్డి, దేవిడి వేణుగోపాల్ రెడ్డి, చామ విజయ శేఖర్ రెడ్డి, కొత్తపల్లి జైపాల్ రెడ్డి, చెరుకూరి జగన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




