11 April, 2026 | 3:26 AM

కార్మికవర్గ ఐక్యతతోనే పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టగలం

11-04-2026 01:20 AM

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ రాజు 

షాద్ నగర్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికవర్గ ఐక్యత ద్వారనే త్రిప్పి కొట్టగలమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ రాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ మల్లేష్ లు అన్నారు.

నాట్కో ఫార్మా కెమికల్ డివిజన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం కంపెనీ గేటు ముందు యూనియన్ ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించి సామాజిక సంఘీభావ నిధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమo సందర్భంగా వారు మాట్లాడుతూ  కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కార్మికవర్గానికి వ్యతిరేకంగా తెచ్చిన లేబర్ కోడ్స్ వల్ల పర్మినెంట్ ఉద్యోగుల స్థానంలో స్టయిఫండ్ ఇచ్చి పని చేయించుకునే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో యువ కార్మికులు, యువ నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవలసిన అవసరమునదని చెప్పారు. అనంతరం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఈనెల 8, 9, 10 తేదీలలో తలపెట్టిన సామాజిక ఉద్యమ సంఘీభావ పిలిపులో భాగంగా వారు స్వయంగా కార్మికుల నుండి విరాళాలలు సేకరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ll,  కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు..