07-07-2025 08:26:31 AM
టెక్సాస్: సోమవారం అమెరికా సెంట్రల్ టెక్సాస్ వరదల్లో(Texas flash floods) మరణించిన వారి సంఖ్య 79కి పెరిగింది. వరదల్లో మరో 27 మంది బాలికలు గల్లంతయ్యారని షెరీఫ్ తెలిపారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెంట్రల్ టెక్సాస్‌లోని ఇళ్ల పునాదులను కొట్టుకుపోయిన ఆకస్మిక వరదల కారణంగా ఛిన్నాభిన్నమైయ్యాయి. ఒక్క కెర్ కౌంటీలోని గ్యాడాలుపే నది(Guadalupe River) సమీపంలో 68 మంది మృతి చెందారు. గ్వాడాలుపే నది ఉప్పొంగడంతో లొతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గ్వాడాలుపే నది తీరంలో ఉన్న శిక్షణాశిబిరాన్ని వరద నీరు ముంచెత్తింది. టెక్సాస్ వరదల్లో చిక్కుకున్న 850 మందిని అధికారులు రక్షించారు.
కొనసాగుతున్న రక్షణ, శోధన కార్యకలాపాలు.
క్లిష్టమైన భూభాగాల గుండా వెళుతున్న రక్షకులు తప్పిపోయిన వారి కోసం తీవ్రంగా గాలింపు కొనసాగించారు. వీరిలో 10 మంది బాలికలు, శిబిరానికి చెందిన ఒక కౌన్సెలర్ కూడా ఉన్నారు. తుఫానులు టెక్సాస్‌ను తాకడం ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా, గవర్నర్ గ్రెగ్ అబాట్ రాష్ట్రవ్యాప్తంగా 41 మంది ఆచూకీ తెలియలేదని, మరింత మంది తప్పిపోవచ్చని చెప్పారు. టెక్సాస్ హిల్ కంట్రీలోని క్యాంప్ మిస్టిక్, ఇతర యువ శిబిరాలకు నిలయమైన కెర్ కౌంటీలో, శోధకులు 28 మంది పిల్లలతో సహా 68 మంది మృతదేహాలను కనుగొన్నారని షెరీఫ్ లారీ లీతా తెలిపారు.
ట్రావిస్, బర్నెట్, ఇతర ప్రదేశాలలో 10 మరణాలు నమోదయ్యాయి.
శుక్రవారం సంభవించిన ఆకస్మిక వరదల నుండి ప్రతి ఒక్కరూ కనుగొనబడే వరకు వెతుకుతూ ఉంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. స్థానిక అధికారుల ప్రకారం, ట్రావిస్, బర్నెట్, కెండాల్, టామ్ గ్రీన్, విలియమ్సన్ కౌంటీలలో మరో పది మరణాలు నమోదయ్యాయి. రాబోయే కొద్ది రోజుల్లో మరణాల సంఖ్య పెరగడం ఖాయం అని టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీకి చెందిన కల్నల్ ఫ్రీమాన్ మార్టిన్ అన్నారు. మంగళవారం వరకు కురిసే అదనపు భారీ వర్షాలు ముఖ్యంగా ఇప్పటికే నిండిన ప్రదేశాలలో మరింత ప్రాణాంతక వరదలకు దారితీస్తాయని గవర్నర్ ఆదివారం హెచ్చరించారు.