07-07-2025 01:32:38 AM
అప్రమత్తమైన నగర పాలల సంస్థ
కరీంనగర్, జూలై6(విజయక్రాంతి): గత రెండు రోజుల నుండి కరీంనగర్ నగరపాలక సంస్థ కమీషనర్ ను మాట్లాడుతున్నా అం టూ.... 9121097923 నెంబర్ తో పాటు ఇతర ఫేక్ నెంబర్లతో నగర వాసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. మీ ఆస్తి పన్ను, నల్లా పన్ను, ట్రేడ్ పన్ను బకాయి ఉందం టూ... ఫేక్ ఫోన్ నెంబర్ల ద్వారా కాల్ చేసి.... పేటిఎం స్కానర్ పంపిస్తాం ఆన్ లైన్ లో మీ పన్నులు చెల్లించాలని కొంత మంది సైబర్ క్రైం కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరి వల లో పడి కొందరు మోసపోయారు.
కొందరు అనుమానంతో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపూల్ దేశాయి దృష్టికి తీసుకురాగా ఆయన ఈ విషయం ను పోలోవెల దృష్టికి తీసుకెళ్లడంతో పాటి నగర ప్రజలను అప్రమత్తం జేశారు.అలాంటి వారి ఫేక్ ఫోన్ కాల్స్ విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాంటి ఫేక్ ఫోన్ కాల్స్ ను నమ్మి ఆన్ లైన్ స్కానింగ్ చేయకుండ జా గ్రత్త పడాలి. మీ యొక్క ఆస్తీ పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు ఇతర ఎలాంటి పన్నులు బకాయి ఉన్నా....
సకాలం లో నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయం లో గల పౌర సేవా కేంద్రంలో కానీ మా నగరపాలక సంస్థ లో విధులు నిర్వహిస్తూ.... బిల్ కలెక్షన్ డివైస్ యంత్రాలతో మీ వద్దకు వచ్చే వార్డు ఆఫీసర్లు( రెవెన్యూ బిల్ కలెక్టర్లు)కు మాత్రమే చెల్లించాలని కమీషనర్ సూ చించారు.
నేరుగా మీ సేవా కేంద్రంలో లే దా మీ మొబైల్ ఫోన్ ఆన్ లైన్ ఆప్ ద్వారా మీ ఇంటి నెంబర్ లేదా పీటిఐఎన్ నెంబర్ తో వివరాలను పరిశీలించిన తర్వతే పేమెం ట్ చెస్కోగలరని ప్రతి ఆర్థిక సంవత్సరం వా రిగా మీ పన్నులు ఎలాంటి బకాయి లేకుండ వడ్డీ భారం పడకుండా నగరపాలక సంస్థ కార్యాలయంలో నేరుగా చెల్లించవచ్చని సూచించారు.
నగరపాలక సంస్థ కమీషనర్ పేరుతో వచ్చే ఫేక్ ఫోన్ కాల్స్ ను ఎవరు న మ్మవద్దు. ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తున్న విష యం మా దృష్ఠికి రావడం జరిగింది. పేక్ కాల్స్ తో సైబర్ క్రైం పాల్పడే వారిపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఫేక్ ఫోన్ కాల్స్ విషయంపై పోలీసులకు కూడ ఫిర్యాదు చేయడం జరిగింది. నగర ప్రజలు ఎవరు ఇలాంటివి నమ్మకుండ అప్రమత్తం గా ఉండాలని కమిషనర్ కోరారు.
ఇంటి దొంగల పనేనా
వచ్చే ఫోన్ కాల్స్ వెనుక ఇంటి దొంగలే ఉమ్మట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్మాయి. నగరపాలక సంస్థలో బకాయి దా రుల డేటా బయటకు వెల్లింది అన్న కోణం లో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. సై బర్ నేరగాళ్ల కన్ను నగర పాలక సంస్థ పై పడటంతో అప్రమత్తమైన అధికారులు పాస్వర్డ్ లని మార్చినట్టు తెలిసింది.