31 August, 2026 | 2:17 AM

నేపాల్‌లో మృత్యు ఘోష!

31-08-2026 12:24 AM

ఉరుముతున్న భోటేకోశి, త్రిశూలి నదులు

* హిమాలయ సరిహద్దు ప్రాంతం నుంచి దక్షిణంగా ప్రవహించే భోటేకోశి నదిలో నీటిమట్టం మళ్లీ పెరిగిందని ఎన్డీఆర్‌ఆర్‌ఎంఏ ఒక ప్రకట నలో హెచ్చరించింది. ‘వరదలతో నిండిన భోటేకోశి నదిలో నీటిమట్టం పెరిగింది. సంబంధిత వర్గాలన్నీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవా లని కోరుతున్నాం’ అని పేర్కొంది. అలాగే త్రిశూలి నదిలో కూడా నీటి మట్టం పెరగడంతో కుషీనగర్‌లో వరద ముప్పు పెరిగింది.

అప్రమ త్తమైన జిల్లా యంత్రాంగం, గండక్ నది వెంబడి ఉన్న సున్నితమైన ప్రాంతాలను ‘హై అలర్ట్’ జారీ చేశారు. ప్రజలు వదంతులను నమ్మవ ద్దని, యంత్రాంగం సూచనలను పాటించాలని జిల్లా మేజిస్ట్రేట్ మహేంద్ర సింగ్ తన్వార్, ఎస్పీ కేశవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దేశంలో మళ్లీ కొండచర్యలు విరిగిపడుతున్నాయని, మళ్లీ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 

788కి చేరిన మృతుల సంఖ్య 

  1. ఇంకా 2,500 మందికిపైగా గల్లంతు
  2. రోజుకో వంద మృతదేహాలకు పైగా లభ్యం
  3. తొలగని బురద.. దొరకని యాత్రికుల ఆచూకీ
  4. తప్పిపోయిన వారి కోసం ఆరో రోజూ రెస్క్యూ
  5. రేయింబవళ్లూ ముమ్మరంగా సహాయక చర్యలు
  6. మళ్లీ విరుగుతున్న కొండచరియలు, కురుస్తున్న వర్షాలు
  7. ఉరుముతున్న భోటేకోశి, త్రిశూలి నదులు
  8. ఆయా ప్రాంతాల్లో హైలర్ట్ ప్రకటించిన ఎన్డీఆర్‌ఆర్‌ఎంఏ

ఖాఠ్మాండు, ఆగస్టు 30: నేపాల్‌లో ఇంకా మృత్యు ఘోష వెంటాడుతోంది. చిన్నాభిన్నమైన ఇళ్లు, ప్రాజెక్టులు, వంతెన లు, రోడ్లపై పేరుకు పోయిన బురదలో కూరుకుపోయిన శవాల కోసం ఆర్థనాదాలు మిన్నంటుతున్నాయి. తమ వారు బతికున్నారో, మృతిచెందారో, ఎక్కడ చిక్కుకున్నారో తెలియక తరలివచ్చిన ప్రజల తల్లడిల్లుతున్నారు. మరోపక్క మృతుల సంఖ్య ఆదివారం నాటికి 7౮8కి చేరింది. గత ఆరు రోజులుగా కొనసాగుతన్న రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) వల్ల రోజుకో వంద మృతదేహాలకు పైగా లభ్యమవుతున్నాయి.

ఇంకా 2,500 మందికి పైగా గల్లంతయ్యారు. జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో 537 మందికి పైగా ఆచూకీ దొరకడం లేదు. వారం రోజులవుతున్నా.. ఇంకా బురద తొలగకపో వడంతో యాత్రికుల ఆచూకీ దొరకడం లేదు. గల్లంతైన వారి కోసం తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య 20 వేల భద్రతా సిబ్బందితో వరద ప్రభావిత ప్రాంతాల్లో, సొరంగాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా రేయింబవళ్లూ కొనసాగుతున్నాయి. 

మరోపక్క భోటేకోశి నదిలో మళ్లీ నీటిమట్టం పెరుగుతుండడం, త్రిశూలి నది ఉప్పొంగుతుండడం, మళ్లీ కొండచరి యలు విరుగుతుండడం, వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో హైలర్ట్ ప్రకటించారు. మళ్లీ వరద ముప్పు ఉందని, ప్రజలు, రెస్క్యూ సిబ్బందితో సహా అందరూ అప్రమత్తంగా ఉండాల ని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ అథారిటీ (ఎన్డీఆర్‌ఆర్‌ఎంఏ) కోరింది. ఈ నెల 26న నేపాల్‌లో ఆకస్మిక వరదలు సంభ వించి,

దేశాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. నేపాల్‌లో విపత్తు తర్వాత 320 మంది విదేశీయులతో సహా మొత్తం 2,502 మంది గల్లంతయ్యారు. ఇందులో 275 మందికి పైగా భారతీయులు, 128 మంది భారత సంతతికి చెందిన వారి ఆచూకీ తెలియకుండా పోయింది. మరో 108 మందిని రక్షించారని న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం,

గల్లంతైన వారిలో వరద ప్రభావిత మూడు జిల్లాల్లోని వివిధ పాఠశాలలకు చెందిన 238 మంది విద్యార్థులు, 18 మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వరద ప్రభావిత రసువా, నువాకోట్ జిల్లాల్లోని తొమ్మిది జలవిద్యుత్ ప్రాజెక్టులలో 537 మంది కార్మికులు, ఉద్యోగుల ఆచూకీ గల్లంతైంది. ఈ ప్రాజెక్టులలో 898 మంది కార్మికులు, ఉద్యోగులతో సంబంధాలు తెగిపోయిన ట్లు ప్రాథమికంగా పేర్కొంది. వారిలో 361 మందిని రక్షించగా, 537 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు.

చైనా వైపు కూడా 16 మంది మరణించగా, 546 మంది గల్లంత య్యారు. అక్కడ సహాయక చర్యలు పూర్తి వేగంతో కొనసాగుతున్నాయి. టిబెట్‌లో గల్లంతైన వారిలో 23 దేశాలకు చెందిన 261 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 49 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఆదివారం సాయంత్రం వరకు, ఒక్క చిటవాన్ జిల్లా నుంచే 264 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ తర్వాత తూర్పు నవల్పరాసి లో 194, పశ్చిమ నవల్పరాసిలో 100 మృతదేహాలు లభించాయి.

గోర్ఖా, ధాడింగ్, నువాకోట్, తనాహు, రసువా అనే మరో ఐదు జిల్లాల నుంచి కూడా మరిన్ని మృతదేహా లు లభించాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాలలో కేవలం 17 మాత్రమే గుర్తించామని, చట్టపరమైన ప్రక్రియ లు పూర్తి చేసిన తర్వాత ఇప్పటివరకు 96 మృతదేహాలకు అంత్య క్రియలు నిర్వహించినట్లు భాగమతి ప్రావిన్స్ పోలీస్ కార్యాలయ ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ధమాలా చెప్పారు. ఖననానికి ముందు మృతదేహాల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి భద్రపరిచామని చెప్పారు.

భారత్ నుంచి 18 మంది ఫోరెన్సిక్ నిపుణుల బృందం నేపాల్‌కు చేరుకుందని నేపాల్ అధికారి స్పష్టం చేశారు. తమ బంధువుల కోసం వెతుకుతున్న ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో నేపాల్ ఆసుపత్రులలో తమతమ వారి మృతదేహాలే వని వెతుకుతూ.. కన్నీటిపర్యంతం అవుతున్నారు. 

20 వేల మంది భద్రతా సిబ్బందితో ఆపరేషన్

నేపాల్ ప్రభుత్వం గాలింపు, సహాయక చర్యల కోసం దాదాపు 20,000 మంది భద్ర తా సిబ్బందిని మోహరించింది. మరోవైపు చిక్కుకు పోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాల కు తరలించడానికి హెలికాప్టర్లు పదేపదే గస్తీ కాస్తున్నాయి. దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు,

కఠినమైన భూభాగం, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీంతో నేపాల్.. భారతదేశం, చైనా, ఇతర దేశాల నుంచి ప్రత్యేక సహాయం కోరింది. సహాయక బృందాలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయని, సొరంగం వద్ద ఆపరేషన్లు ఒక కీలకమైన పురోగతికి చేరాయని సైనిక అధికారులు తెలిపారు.