యష్‌కు అంకితం
20-05-2024 02:43 AM
బెంగళూరు: చావో రేవో లాంటి మ్యాచ్‌లో చివరి ఓవర్ అద్భుతంగా వేసిన యష్ దయాల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అంకితమిస్తున్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ కాని ఫైనల్లో బెంగళూరు 27 పరుగులతో నెగ్గి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అంతటి కీలక మ్యాచ్‌లో ధోనీ, జడేజా వంటి బ్యాటర్లు క్రీజులో ఉన్నప్పుడు యష్ ఏ మాత్రం తడబకుండా బౌలింగ్ చేశాడని డుప్లెసిస్ కితాబిచ్చాడు. చెన్నై ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సిన దశలో యష్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.






