మేనేజ్‌మెంట్ మద్దతుతోనే: యష్
20-05-2024 02:42 AM
బెంగళూరు: నిరుడు ఐపీఎల్లో కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ దెబ్బకు ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు సమర్పించుకొ ని అపప్రద మూటగట్టుకున్న మీడి యం పేసర్ యష్ దయాల్.. ఇప్పుడు ధోనీ, జడేజా వంటి హిట్టర్లను 17 పరుగులు చేయనివ్వకుండా అడ్డుకొని తన విలువ చాటుకున్నాడు. ‘బెంగళూరుకు మారడం చాలా ఉపయోగ పడింది. జట్టులో నా ప్రాధాన్యత ఏంటో స్పష్టం గా చెప్పిన మేనేజ్‌మెంట్.. ఎప్పటికప్పుడు అండగా నిలిచింది’ అని యష్ పేర్కొన్నాడు.






