3 September, 2026 | 3:16 AM

దీక్షారంభ్ స్టూడెంట్ ఓరియంటేషన్

03-09-2026 | 02:10am

 అమిటీ యూనివర్సిటీలో విద్యార్థులకు స్వాగతం

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): అమిటీ యూనివర్సిటీ(Amity University) హైదరాబాద్‌లో నూతన విద్యా సంవత్సరం(New Academic Year) సందర్భం గా నిర్వహిస్తున్న దీక్షారంభ్ స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్-2026(Deeksharamb Student Orientation Program)లో భాగంగా జడ్ స్కేలర్ సైబర్ అకాడమీ ఫర్ స్టూడెం ట్స్, ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ బ్లాక్‌చెయిన్‌లను ప్రారంభించారు. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఈ రెండు రోజుల కార్యక్రమం జరుగుతోంది.

అమిటీ ఎడ్యుకేషన్ గ్రూప్ ఫౌం డర్ ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ కె. చౌహాన్, అమిటీ యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ అతుల్ చౌహాన్ విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. అమి టీ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ యు. రామచంద్రన్, అమి టీ యూనివర్సిటీ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్.వి. కోటా రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో అమిటీ యూనివర్సిటీ పాట్నా వైస్ ఛాన్సలర్ డాక్టర్ వివేకానంద్ పాండే, అమిటీ యూనివర్సిటీ నోయిడా మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ బాబులాల్ ఆర్య, జడ్ స్కేలర్ గ్లోబల్ హెడ్ అకడమిక్ అలయన్స్ అభిర్ నాయక్, ఐడీఎస్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ సుబ్రహ్మణ్యం యాదవల్లి పాల్గొన్నారు.

అమిటీ ఎడ్యుకేషన్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్‌మార్కెటింగ్ అవుట్రీచ్ అండ్ అడ్మిషన్స్ డాక్టర్ ప్రీతి సహ్ని, డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాదురి, అమి టీ యూనివర్సిటీ హైదరాబాద్ రిజిస్ట్రార్ డాక్టర్ అమీత్ చవాన్ హాజరయ్యారు. కొత్త సెంట ర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థులకు సైబ ర్ సెక్యూరిటీ, బ్లాక్చెయిన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ప్రాక్టికల్ లెర్నింగ్, పరిశ్రమ నిపుణులతో ప్రత్యక్ష అనుభవం, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు లభించనున్నాయి.