ప్రీ క్వార్టర్స్‌లో శ్రీకాంత్
- తొలి రౌండ్‌లోనే లక్ష్య సేన్ ఔట్
- చైనా మాస్టర్స్ టోర్నీ
బీజింగ్, సెప్టెంబర్ 2 : చైనా మాస్టర్స్ టోర్నీ(China Masters Tournament,)లో భారత స్టార్ షట్లర్(Indian star shuttler) కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) శుభారంభం చేశాడు. రౌండ్ ఆఫ్ 32లో చైనీస్ తైపీకి చెందిన చి యు-జెన్ను 21--16, 21---15తో వరుస గేముల్లో ఓడించి ప్రీ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. 20--23 సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్లో శ్రీకాంత్‌ను తొలి రౌండ్‌లోనే ఓడించిన యు-జ్పె ఈసారి భారత షట్లర్ పైచేయి సాధించాడు. తొలి గేంలో ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్.. రెండో గేంలోనూ ప్రశాంతంగా ఆడి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు యువ షట్లర్ లక్ష్య సేన్(Young shuttler Lakshya Sen)కు ఆదిలోనే షాక్ తగిలింది.
బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో కెనడాకు చెందిన విక్టోర్ లాయ్ చేతిలో లక్ష్య వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. 14---21, 7---21 తేడాతో లాయ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ ఏడాది లక్ష్యపై లాయ్‌కు ఇది వరుసగా మూడో విజయం. ఇదిలా ఉంటే మికస్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ అదరగొట్టింది. రౌండ్ ఆఫ్ 32లో థాయ్లాండ్‌కు చెందిన టోంకిడ్ సాహెంగ్- టోన్గ్ సాహెంగ్ జోడీని 21-8, 21---9తో చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌కు చేరింది.






