దీపక్ తివారి సేవలు మరువలేనివి
కలెక్టర్ కె.హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా, ఇంచార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారిగా దీపక్ తివారి అందించిన సేవలు మరువ లేనివని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి పై వెళుతున్న జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇంచార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి దీపక్ తివారి ఆత్మీయ వీడ్కోలు సభ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులను సమన్వయం చేసుకొని జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఆకాంక్షిత జిల్లా, తిర్యాణి బ్లాక్ లో నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేశారని తెలి పారు. అనంతరం దీపక్ తివారి మాట్లాడుతూ జిల్లాలో అదనపు కలెక్టర్‌గా, ఇంచార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారిగా పని చేసిన కాలంలో అధికారుల సమన్వయంతో శాసనసభ, పార్లమెంట్, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ప్రశాం తంగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల జిల్లా అధికారులు మాట్లాడుతూ దీపక్ తివారి జిల్లాకు అం దించిన సేవలను గుర్తు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను శాలువాలతో సన్మానించా రు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా అధికారులు, తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.




