18 March, 2026 | 3:46 AM

ఆగని అక్రమ ఇసుక దందా?

18-03-2026 12:27 AM
  1. జిల్లాలో జోరుగా అక్రమంగా ఇసుక, మొరం రవాణా..

మహారాష్ట్ర, నిజామాబాద్ నుంచి జీరో ఇసుక 

ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి 

చెక్‌పోస్ట్‌లు ఉన్నా.. ప్రయోజనమేదీ..? 

నిర్మల్ జిల్లా కేంద్రంలో ముఠాగా ఏర్పడి నలుగురు ఇసుక వ్యాపారులు ? 

అక్రమ దందాపై కఠినంగా వ్యవహరించాలి: కలెక్టర్ ఆదేశం

నిర్మల్, మార్చి ౧7 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అక్రమ క్వారీ ఇసుక రవాణా అడ్డుకున్నందుకు పోలీసులు రెవిన్యూ శాఖ అధికా రులు మైనింగ్ శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న అక్రమ దందా ఆగడం లేదు. దీం తో జిల్లాలో ఇసుక క్వారీ మాఫియా రెచ్చిపోతున్నారు. పోలీసు రెవెన్యూ శాఖ అధికారుల కండ్లు గప్పి ప్రతినిత్యం పదుల సంఖ్యలో భారీ లారీల ఇసుక వారి రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.

నిర్మల్ జిల్లాలో గృహ వాణిజ్యనిర్మాణ రం గంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు తప్పనిసరిగా ఇసుక, క్వారీ, మొరం తప్పనిసరి కావడంతో నిర్మల్ జిల్లాలో కొందరు బడా బాబులు ఈ వ్యాపారాన్ని ఎంచుకొని ప్రభుత్వాన్ని ముంచుతూ కోట్లాది లాభాలను గడిస్తున్నారు. జిల్లాలో నిత్యం అక్రమ దందా జోరుగా సాగుతున్న అధికారులు మాత్రం కంటి తడుపు చర్యలు చేపడుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.

నిర్మల్ జిల్లాకు మహా రాష్ట్రలోని ధర్మాబాద్ బోకర్ కిన్‌వాట్‌తో పాటు నిజామాబాద్ జిల్లాలోని కందుర్తి, మోర్తాడ్ భీమ్గల్, కమ్మర్పల్లి, పెద్దవాగు నుంచి జీరో ఇసుక రవాణా జరుగుతుంది. అక్కడి వాగులు నదుల నుంచి వ్యాపారస్తుల వద్ద ఈ ప్రాంతం వారు కొనుగోలు చేసి లారీ ల్లో నిర్మల్ సరిహద్దు గ్రామాల ద్వారా నిర్మల్ బైంసా పట్టణాలకు గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలి స్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక క్వారీ రవాణా చేస్తే ప్రభుత్వ రుసుమును చెల్లించి వే బిల్ ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించిద్వారా వీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేయాలి.

భైంసా పట్టణంలో ముగ్గురు నిర్మల్ జిల్లా కేంద్రంలో నలుగురు ఇసుక వ్యాపారులు ఓ ముఠాగా ఏర్పడి ఈ వ్యాపారం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందినవారు మహారాష్ట్ర, నిజామాబా ద్‌లో అక్కడి వారితో ఒప్పందలు కుదుర్చుకొని ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షల రూపాయలు గడుస్తున్నారు. అయితే నిర్మల్ బైంసా ప్రాంతానికి గతం లో కాళేశ్వరం చంద్రపూర్ చెన్నూర్ మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి ఇసుక రవా ణా జరిగేది. ఇది ప్రభుత్వ నిబంధన పాటి స్తూ వే బిల్లుతో రావడం వల్ల కొద్దిగా ధర ఎక్కువైనా వినియోగదారులకు ఇబ్బంది కలిగేది కాదు. 

సరిహద్దు ప్రాంతాల్లో కరువైన నిఘా 

వారం రోజుల్లోనే ఒక బాసరలోని మహారాష్ట్రకు చెందిన 8 లారీలు పట్టుబడ్డాయి. మహారాష్ట్ర ఇసుక ధర్మాబాద్ తానూర్ కుబీర్ ప్రాంతాల మీదుగా జిల్లాకు వస్తుంది. నిజాంబాద్ సంబంధించిన ఇసుక మామడ మండ లం పునకల్ దిమ్మదుర్తి పంచ కూడా మీదుగా నిర్మల్ జిల్లాలో ప్రవేశం జరుగుతుంది. ఒక్కొ క్క లారీలు 30 టన్నుల నుంచి 45 టన్నుల వరకు ఇసుక రవాణా జరుగుతుంది.

దీనికి తోడు జిల్లాలోని ప్రభుత్వ భూములు పట్టా భూముల్లో వారి అక్రమ రవాణా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికి జిల్లాలోని బైంసా దిల్వార్పూర్ కడెం ఖానాపూర్ సారంగాపూర్ కుబీర్ తానూర్ కుంటాల తదితర ప్రాంతాల్లో మొరం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మొరం తవ్వకాలు నిర్వహించేటప్పుడు మైనిం గ్ అనుమతులు తీసుకొని రవాణా చేయవల సి ఉండగా సదరు వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.

చెరువులు బుట్ట భూము లు, పడవు భూములు, తదితర భూముల నుంచి ప్రతినిత్యం వేలాది టిప్పర్లు సర్వ చేస్తున్నాయి. పెద్ద పెద్ద జెసిబిలను వినియోగించి రాత్రి పగలు తేడా లేకుండా ఈ అక్రమంగా సాగుతుంది. రెవిన్యూ పోలీస్ శాఖ అధికారు లు తనిఖీలు చేస్తున్న కొందరు వారి కళ్ళు కప్పి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఈ దందా సాగిస్తున్నారు.

ఎట్టకేలకు చర్యలు షురూ ..

నిర్మల్ జిల్లాలో అక్రమ ఇసుక దందా మొ రం రవాణాపై అధికారులు ఎట్టకేలకు చర్యల కు ఉపక్రమించారు. బాసర కుబీర్ సారంగపూర్ మండలాల్లో అక్రమ ఇసుక రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మొరం తవ్వుతున్న ప్రాంతాలను గుర్తించి రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు నిరంతరంగా తనిఖీలు నిర్వహించాలని అభిలాష అభినవ్ ఆదేశించారు. నిర్మల్, బైంసా, ఖానాపూర్ పట్టణాల్లో అనుమతి లేని ఇసుక నిల్వలు ఉంటాయి.

వాటిని సాధించుకోవాలని సంబంధిత వ్యాపారులపై కేసులు పెట్టాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. రెండు రోజుల క్రితం బైంసా పట్టణం లో ఏడుగురు ఇసుక వ్యాపారులపై కేసులు పెట్టగా నిర్మల్లో మరో ఇద్దరిపై కేసులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మొరం, ఇసుక రవాణా చేస్తున్న వారిని గుర్తించి పోలీసు రెవెన్యూ శాఖ వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. స్వయంగా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల మంగళవారం వివిధ ప్రాంతాలను సందర్శించి ఇసుక అక్రమ దందాపై కఠినంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.