calender_icon.png 13 November, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీప్‌ఫేక్ కలవరం!

13-11-2025 12:00:00 AM

ప్రజాస్వామ్యాన్ని కాపాడే న్యాయ వ్యవస్థ కూడా డీప్‌ఫేక్ బారిన పడడం ఆందోళన కలిగించే అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొనడంతో ఏఐ దుర్వినియోగం మరోసారి తెరమీదకు వచ్చినట్లయింది. ఎందరో న్యాయమూర్తులు, న్యాయవాదుల మార్ఫింగ్ ఫోటోలు తన దృష్టికి వచ్చాయని, సోషల్ మీడియాలో తమ డీప్‌ఫేక్ ఫోటోలు ఉండడం చూస్తుంటే భారత్‌లో ఇది అతి పెద్ద ప్రజాస్వామ్య ముప్పుగా పరిగణించాల్సిన అవసరముందన్నారు.

నిజానికి డీప్‌ఫేక్ లాంటి సాంకేతికతను మంచికి వినియోగిస్తే ఎలాంటి ఇ బ్బందులు ఉండవు.. కానీ అదే టెక్నాలజీతో మోసాలకు పాల్పడితేనే సమస్యలు మొదలవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో చేస్తున్న డీప్‌ఫేక్ టెక్నాలజీ అనేది ప్రస్తుతం సెలబ్రెటీలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. డీప్‌ఫేక్ వల్ల సెలబ్రెటీల పేరు, ప్రతిష్టకు భంగం వాటిల్లుతోంది. సినీనటులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రష్మిక మం దన్నా, రజినీకాంత్ వంటి ఎంతో మంది సినీ ప్రముఖులు డీప్‌ఫేక్ వీడియోల బారిన పడ్డారు.

ఇటీవలే టాలీవుడ్ నటుడు చిరంజీవి సైతం డీప్ ఫేక్ వీడియోల బారిన పడి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. కొం దరు దుండగులు ఏఐని ఉపయోగించి చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలను రూపొందించారు. ప్రభుత్వాలు డీప్‌ఫేక్‌పై కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరముందని చిరంజీవి పేర్కొన్నారు. డీప్‌ఫేక్ అంటే ఏమిటనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది.

సాధారణంగా అద్దంలో మనల్ని మనం చూసుకుంటే కనిపించేది ప్రతిబింబం. అదే అద్దం ఎదుట నిల్చున్న వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి ప్రతిబిం బాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సాయంతో చేయడాన్ని డీప్‌ఫేక్ అంటారు. డీప్ లెర్నింగ్, ఫేక్ కలిపి డీప్‌ఫేక్‌గా వ్యవహరిస్తారు. డీప్‌ఫేక్ టెక్నాలజీ వల్ల లాభాలున్నాయి. అసాధ్యమనుకున్న వాటిని ఈ టెక్నాలజీతో సుసాధ్యం చేయొచ్చు. ఉదాహరణకు ఎప్పుడో చనిపోయిన నటు డిని మళ్లీ తెరపైన చూపించేందుకు డీప్‌ఫేక్ ఉపయోగపడుతుంది.

హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే మాట్లాడే నైపుణ్యమున్న వ్యక్తిని స్థానిక భాషలో మా ట్లాడుతున్నట్లుగా వీడియోలు రూపొందించవచ్చు. ఒక టెక్నాలజీ అభివృ ద్ధి చెందితే దానిలో మంచి ఎంత ఉంటుందో చెడు అంతకుమించి ఉం టుంది. ఆ మధ్య ఢిల్లీ ఎన్నికల సమయంలో ఒక నేత రెండు భాషల్లో మా ట్లాడిన డీప్‌ఫేక్ వీడియోను ఆ పార్టీయే స్వయంగా విడుదల చేసింది. ఎన్నికల వేళ కావడంతో ఇందులో ఏది నిజమనేది తెలుసుకునే లోపే జర గా ల్సిన నష్టం జరిగిపోతుంది.

ఇలాంటి సున్నిత అంశాలపై డీప్‌ఫేక్ వీడియో లు బయటికొస్తే శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడుతుంది. తాజాగా డీప్‌ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి ‘స్కిడ్ గేమ్’ వెబ్ సిరీస్ హీరో లీ జంగ్ ఫోటోను మార్ఫింగ్ చేసిన అగంతకుడు ఒక మహిళ దగ్గర దాదాపు 3 కో ట్లు కాజేయడం సంచలనం కలిగించింది.

టెక్నాలజీ మాటున జరుగుతున్న ఇలాంటి దుర్మార్గాలను అడ్డుకోవడానికి ఇప్పుడిప్పుడే కొత్త టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. డీప్‌ఫేక్ వీడియోల్లో ముఖ కవళికలు, మాటలకు సంబంధం ఉండదు. డీప్‌ఫేక్ నేరాలపై విస్తృత అవగాహన ద్వారా మనల్ని మనం కొంతైనా కాపాడుకోవచ్చు.