14 April, 2026 | 8:49 PM

మల్లన్న ఆలయంలో దీపోత్సవం

28-10-2025 09:55 PM

కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా సామూహిక దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మహా మండపంలో అర్చకులు లలిత సహస్రనామ పారాయణం గావించి, దీపోత్సవం జరిపించారు. ఈ దీపోత్సవంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని తరించారు. ఈ దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు ప్రసాదాలను అందజేశారు.