జెడ్‌పీహెచ్‌ఎస్ ధర్మోరాలో అయోడిన్ లోపంపై అవగాహన కార్యక్రమం
28-10-2025 09:45 PM
మోర్తాడ్ (విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి కమ్మర్‌పల్లికు చెందిన డా. నర్సింహ స్వామి, వైద్య అధికారి, జిల్లా పరిషత్ హై స్కూల్ ధర్మోరాలో అయోడిన్ లోపంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. నర్సింహ స్వామి అయోడిన్ యొక్క ప్రాధాన్యత, అది శరీర వృద్ధి, మేధస్సు అభివృద్ధిలో చేసే కీలక పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే అయోడిన్ లోపం వల్ల కలిగే సమస్యలు, లక్షణాలు, నివారణ చర్యలు గురించి అవగాహన కల్పించారు. వారు అయోడైజ్డ్ ఉప్పు వినియోగం ద్వారా అయోడిన్ లోపాన్ని నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రఘునందన చారి, ఉపాధ్యాయులు విద్యార్థులు చురుకుగా పాల్గొని విలువైన ఆరోగ్య సమాచారం పొందారు.




