13-08-2025 11:23:36 AM
యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండల(yacharam mandal) పరిధిలోని గున్ గల్ ఫారెస్ట్ వద్ద నాగార్జునసాగర్ వద్ద రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జింక సంఘటన స్థలంలోని అక్కడికక్కడే మృతి చెందింది. రోడ్డుపై పడి ఉన్న మృతదేహాన్ని రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు రోడ్డు పక్కన వేసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. గతంలో ఇదే తరహాలో జింక మృతి చెందిందని వాహనాలు వేగంగా వెళ్లకుండా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.