calender_icon.png 13 August, 2025 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి రాంనగర్ బ్రిడ్జిపై పొంగి పొర్లుతున్న వాగు

13-08-2025 11:38:27 AM

నిలిచిపోయిన రాకపోకలు.. అసౌకర్యాoలో ప్రజలు

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): విస్తారంగా కురుస్తున్న వానలకు బెల్లంపల్లిలోని రామ్ నగర్ బ్రిడ్జిపై(Ram Nagar Bridge) వరదనీరు పొంగిపొర్లుతుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రామ్ నగర్ వాగు ఉప్పొంగడంతో ప్రజలు రాకపోకలు నిలిచిపోయి ఇళ్లకే పరిమితమయ్యారు.  మంగళవారం రాత్రి నుంచి బెల్లంపల్లిలో భారీ వర్షానికి వాగులు, వంకలు వరద నీటితో పరవళ్ళు తొక్కాయి. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. పట్టణంలోని పలు కాలనీలోనీ ఇళ్లకు వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పట్టణంలోని ప్రధాన కాలువలు వరద నీటితో పరుగులు పెడుతున్నాయి.