9 April, 2026 | 8:48 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

20న దేశవ్యాప్త సమ్మె

16-04-2025 12:00 AM

జయప్రదం చేయాలని కార్మిక సంఘాల పిలుపు

లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 15(విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం అవలం బిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌టియు భవనంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ అధ్యక్షతన జిల్లా కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐపియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్, టియుసిఐ జిల్లా కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈనెల 20 న చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.నరేంద్ర మోడీ కార్పొరేట్ల మెప్పు కోసం కార్మిక చట్టాలను కుదించారని ఆరోపించారు.రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దుచేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్, ఆర్టీసీ రిటైర్డ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.