5 July, 2026 | 2:25 AM

ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేత

05-07-2026 12:00 AM

కూకట్‌పల్లి, జూలై 4 (విజయక్రాంతి): కూకట్ పల్లి జోనల్ పరిది కూకట్ పల్లి, ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిది లో రోడ్డును ఆక్రమించి  వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణాలను సి ఎం సి  అధికారులు శనివారం కూల్చి వేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రోడ్డును ఆక్రమించి ఫుట్ పాతులపై వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించి నట్టు అధికారులు తెలిపారు.

రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తుండడం వల్ల ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు నివారించడంలో భాగంగా జోనల్ సర్కిళ్లలోని పలు ప్రాంతాలలో ఆక్రమణలను తొ లగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.

కూకట్ పల్లి సర్కిల్ కేపిహెచ్ బి కాలనీ లోని బి ఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ నుండి టెంపుల్ బస్టాప్ వరకు, ఆల్విన్ కాలనీ సర్కి ల్ పరిధిలో అంబ భవాని హోటల్ నుండి కె ఎల్ బార్ వరకు గల ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించినట్టు అధికారులు తెలిపా రు. ఫుట్ పాతులపై తిరిగి వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటా మని అధికారులు హెచ్చరించారు.