26 August, 2026 | 2:34 PM

అక్రమ నిర్మాణం కూల్చివేత

21-05-2024 02:48 AM

రాజేంద్రనగర్/ అబ్దుల్లాపూర్‌మెట్, మే 20 (విజయక్రాంతి):  గండిపేట్ మండలంలోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మాణా లు చేపడితే ఉక్కుపాదం మోపుతామని మం డల తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని వట్టినాగుల పల్లి సర్వే నంబర్ 128లోని ప్రభుత్వ స్థలంలో రెండు అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండటంతో తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆర్‌ఐ విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కూల్చి వేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడి తే స్థానికులు వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. 

అబ్దుల్లాపూర్‌మెట్‌లో.. ప్రభుత్వ భూమి లో అక్రమంగా నిర్మించిన షెడ్డును రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాముల గ్రామ పరిధిలో సర్వే నంబర్ 422లో ఉన్న ప్రభుత్వ భూమి లో 15 గుంటల భూమిని లక్ష్మారెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసి షెడ్లు నిర్మించాడు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారుల సోమవారం మెట్ ఎమ్మార్వో నేతత్యంలో సిబ్బం ది జేసీబీలతో షెడ్లను కూల్చివేశారు.