సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
కూకట్‌పల్లి, మే 20 : వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని పలు ఆపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వాసులు సోమవారం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అపార్ట్‌మెంట్లలో డ్రైనేజీ, వరదనీరు సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అపార్ట్‌మెంట్లతో పాటు కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా వర్షంనీరు నిలవకుండా అధికారులతో చర్చించి సమస్య ఉత్పన్నం కాకుండా చర్య లు తీసుకుంటామన్నారు. గతంలో వేసిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ సైజు పరిమాణం చిన్నది కావడంతో తరచూ డ్రైనేజీ సమస్య ఏర్పడుతున్నదన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చిన తన దృష్టికి తీసుకొస్తే వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు, ఆపార్ట్‌మెంట్ వాసులు పాల్గొన్నారు.






