22 August, 2026 | 1:41 AM

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

22-08-2026 12:47 AM

ముత్తంగిలో తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారుల చర్యలు

పటాన్చెరు, ఆగస్టు 21: ముత్తంగి గ్రామ పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ముత్తంగి గ్రామంలోని సర్వే నంబర్లు 65, 23లోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించకుండా ప్రజలు సహకరించాలని సూచించారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వ భూములపై ఆక్రమణలను అడ్డుకునేందుకు చర్యలు కొనసాగిస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.