22 August, 2026 | 2:41 AM

వీరభద్రస్వామి ఆలయ ప్రతిష్ఠలో మాజీ మంత్రి దంపతులు

22-08-2026 01:41 AM

వనపర్తి మండలం ఆగస్టు 21: మండలంలోని బలిజపల్లి గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, పోచమ్మ అమ్మవారి నాభి శిలల పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వాసంతి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ షడా బసవలింగ అవధూత స్వామి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.