విద్యార్థులకు ఎల్లప్పుడు అండగా ఉంటాం
ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుండె శివకుమార్
అబ్దుల్లాపూర్ మెట్, ఫిబ్రవరి 23: విద్యార్థులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుండె శివకుమార్ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల కమిటీ ఆధ్వర్యంలో అనాజ్ పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సోమవారం సందర్శించారు. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా గుండె శివకుమార్ మాట్లాడుతూ... విద్యార్థులకు ఎల్లప్పుడు ఎస్‌ఎఫ్‌ఐ అండగా ఉంటుందని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతే ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు సమాచార ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేందర్, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు.




