17 April, 2026 | 1:51 PM

Breaking News

హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •   పెద్దకొత్తపల్లి గ్రామ హహిళ సర్పంచ్‌కు ఘోర అవమానం.!   •   నోటీసులు వెనక్కి తీసుకోవాలి.. సీపీఐ నాయకుల డిమాండ్   •  

ఖమ్మంలో హైటెన్షన్.. పేదల ఇండ్లు కూల్చివేత

24-02-2026 11:38 AM

ఖమ్మం శివారులో ఉద్రిక్తత.. గుడిసెలు తొలగిస్తున్న అధికారులు

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఉద్రిక్తత

హైదరాబాద్: ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతంలోని( Khammam Collectorate) వెలుగుమట్ల భూదాన భూమి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో(Bhoodan Lands) గుడిసెలను అధికారులు తొలగిస్తున్నారు. వెలుగుమట్ల భూదాన్ భూముల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పదేళ్లుగా గుడిసెలు వేసుకుని ఇక్కడే ఉన్నామని పేదలు చెబుతున్నారు. అర్బన్ పార్క్ భూముల్లో(Urban Park Lands) అక్రమంగా ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. భూదాన్ భూములను ప్రభుత్వం ఎవరికీ కేటాయించలేదని పోలీసులు వెల్లడించారు.

ఖాళీ చేయాలని ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చామని అధికారులు పేర్కొన్నారు. వెలుగుమట్ల(Velugumatla) వాసులు విధిలేక వాహనాల్లో సామాన్లు వేసుకుని వెళ్లిపోతున్నారు. అధికారులు నిరాశ్రయిలకు పలుచోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. వెలుగుమట్లలోని 60 ఎకరాల భూదాన్ భూముల్లో(Velugumatla Bhoodan Lands) 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. అధికారులు జేసీబీలతో గుడిసెలను తొలగించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్ళుగా ఇక్కడే బతుకుతున్నామని తమకు పట్టాలు ఇవ్వాలని పేదలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తన ఇల్లును కూల్చేసినందుకు బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కొందరు స్థానికులు జేసీబీలకు అడ్డుగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు.