విషాదం మిగిల్చిన కంటైనర్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి ఒకరి పరిస్థితి విషమం.
షాబాద్ మండలం హైదరాబాద్ గ్రామంలో నెలకొన్న విషాదఛాయలు.
చేవెళ్ళ,(విజయక్రాంతి): పేద కుటుంబాలు అయిన సమాజంలో ఎలాగైనా తన కాళ్లపై తను బతకాలన్న సంకల్పం వాళ్ళది. తల్లి ప్రేమకు దూరమైన వారు రోజువారి కూలీలుగా కాలం నెట్టుకొస్తున్న యువరక్తం. పని ముగిశాక ఇంటికి వెళుతున్న తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి కంటైనర్ రూపంలో దూసుకు వచ్చిన లారీ వారి కళలను కమ్మేసి కానరాని లోకాలకు పంపి భావితరాల బతుకులు విషాదాంతమయ్యాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం షాబాద్ మండలంలోని హైతాబాద్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న బైక్ ను ఆదివారం రాత్రి నాగర్ గూడ చౌరస్తాలో కంటైనర్ లారీ ఢీ కొంది.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొక్కరికి తీవ్ర గాయాలు. షాబాద్ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలప్రకారం... హైతాబాద్ గ్రామానికి కు చెందిన దాసరి అజయ్ (19) అదే గ్రామానికి ఉదయ్ కిరణ్ (20)లు మృతి చెందగా అజమ్ (19) అనే వ్యక్తి తీవ్ర గాయాలు కాగా ఓ ప్రైవేట్ హాస్పిటల్ ల్లో చికిత్స పండుతున్నడు. ఈ ఘటనలో మృతి చెందిన అజయ్ ఉదయ్ కిరణ్ మృత్తదేహల చేవెళ్లలోని ప్రభుత్వం హాస్పిటల్ కి తరలించారు. అయితే అర్ధరాత్రి ఈ యువకులు నాగర్ గూడా ఈసీ వాగు దాటాక అల్లవాడ రెవెన్యూలో ఉన్న పెట్రోల్ బంకులోపెట్రోల్ పోసుకొని తిరిగి వస్తున్న క్రమంలో నాగర్ గూడ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన భారీకేడ్ల తప్పించబోయి ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ప్రమాదంలో చనిపోయిన అజమ్ కు అమ్మ లేదు, నాన్నతో ఉంటున్న అజయ్ చికెన్ షాప్లో రోజువారి కూలీగా పని చేస్తుండగా ఉదయ్ కిరణ్ కూడ కూలీగా పనిచేస్తూ ఉంటాడు. మంచి భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలవడంతో హైతాబాద్ గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. వీరి కుటుంబ నేపథ్యం తెలుసిన పలువురు కంటతడి పెట్టారు.
సీఐ వాహనంలో ఆసుపత్రికి తరలింపు
మొయినాబాద్ పావనకుమార్ రెడ్డి విసిటింగ్ నిమ్మితం వెలుతుండగా సీఐ కారు లో హాస్పిటల్ కు తరలించారు. సహాయక చర్యలు చేపట్టి తన వృత్తి దర్మంనెరవేర్చారు. విషయం తెలిసి చేవెళ్ళ ఎస్ ఐ సంతోష్ రెడ్డి, మొయినాబాద్ ఎస్ ఐ నర్సింహా రావు ఘటన స్థలాన్ని చేరుకొన్నారు. చనిపోయిన యువకుల శరీర భాగాలూ చిన్నభిన్నమావడంతో పోలీసులతో కలిసి స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.




