calender_icon.png 8 January, 2026 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర సమగ్రాభివృద్ధికే క్యూర్, ప్యూర్, రేర్ పాలసీ

07-01-2026 01:31:49 AM

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీనే లక్ష్యం

తెలంగాణ రైజింగ్‌పై డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే క్యూర్, ప్యూర్, రేర్ పాలసీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రం ఎదగడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. మంగళవారం అసెంబ్లీలో ‘రైజింగ్ తెలం గాణ స్వల్ప కాలిక చర్చలో భట్టి మాట్లాడారు. ప్రస్తుతం మనం 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని, యథావిధిగా కొనసాగితే 2047 నాటికి సహజంగానే 1.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతును, ప్రతి దళితుడిని, ప్రతి గిరిజనుడిని, ప్రతి మహిళను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఇది సరిపోదని పేర్కొన్నారు.

1.2 ట్రిలియన్ డాలర్ల సహజ వృద్ధికి, మ నం ఆశించే 3 ట్రిలియన్ డాలర్ల గమ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి, మనకు గతం నుం చి ఒక నిర్మాణాత్మక విరామం అవసరమన్నారు. మా పెట్టుబడి రేటును జీఎస్‌డీపీలో 52 శాతానికి పెంచాలనే కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని స్పష్టంచేశారు. దేశీ య పొదుపులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, మా స్టార్టప్ల కోసం ఆవిష్కరణలలోని నష్టాన్ని తగ్గించడానికి ఒక ప్రత్యేక ఫండ్ ఆఫ్ ఫండ్స్ మిశ్రమం ద్వారా తాము దీనిని సమీకరిస్తున్నామని వివరించారు. క్యూర్ (కోర్ అ ర్బన్ రీజియన్ ఎకానమీ) పేరిట ఓఆర్‌ఆర్ లోపల, నికర-జీరో, సేవల ఆధారిత మహానగరాన్ని నిర్మిస్తామని చెప్పారు.

ఇక్కడ 30 వేల ఎకరాల అద్భుత భారత్ ఫ్యూచర్ సిటీ ఉందని, ఇది ఏఐ నగరం, ఆరోగ్య నగరాన్ని కలిగి ఉంటుందని వెల్లడించారు. ప్యూర్ (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ) పేరిట ఓఆర్‌ఆర్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య, తయారీ ఇంజి న్‌ను నిర్మిస్తామని, ఇక్కడే కర్మాగారాలు, లాజిస్టిక్స్ హబ్‌లు, బ్లూ -కాలర్ ఉద్యోగాలు వృద్ధి చెందుతాయని తెలిపారు. రేర్ (రూరల్ అగ్రి రీజియన్ ఎకాన మీ) పేరిట రీజినల్ రింగ్ రోడ్ దాటి, వ్యవసాయాన్ని అధిక -విలువైన బయో-ఎకానమీగా పరిగణి స్తామని, ఆహార ప్రాసెసింగ్, పర్యావరణ- పర్యాటక రంగంపై దృష్టి సారిస్తామని వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాల యంతో తాము జర్మ న్ డ్యూయల్- సిస్టమ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ అవలంభిస్తున్నామని చెప్పారు.

ఆరోగ్య ఖర్చును జీఎస్‌డీపీ లో 8 శాతానికి పెంచడానికి కట్టుబడి ఉన్నామని, అనారోగ్య శ్రామిక శక్తి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థను నిర్మించదని పేర్కొన్నారు. రైజింగ్ తెలంగాణ ప్రధాన ఉద్దేశం కోటి మంది మహిళలను  కోటీశ్వరులుగా మార్చడమేనని, తాము స్వయం స హాయక బృందాలకు రుణాలు ఇవ్వడంతోపాటు ఆ సంఘాలను కార్పొరేట్ సంస్థలుగా మా రుస్తున్నామని స్పష్టంచేశారు. సబ్సిడీ ద్వారా కాకుండా ఎం టర్‌ప్రైజెస్ ద్వారా కోటి మంది మహిళలు లక్షాధికారులు కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 2014లో సోనియాగాంధీ మార్గదర్శకత్వంలో రాజకీయ తెలంగాణ కలను సాకారం చేసుకున్నామని, 2024లో సంపన్న తెలంగాణ కోసం ఒప్పందంపై సంతకం చేసి ముందుకు సాగుదామని పేర్కొన్నారు.

‘హిల్ట్’తో రూ.10,776 కోట్ల ఆదాయం

 డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, జనవరి ౬ (విజయ క్రాంతి): హిల్ట్ పాలసీతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి  అసెం బ్లీలో తెలిపారు. ‘హిల్ట్ పాలసీ లేకపోతే ఎక రానికి రూ.12 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఎకరాకు రూ.7 కోట్ల ఆదాయం రాబోతోందన్నారకు. గత ప్రభు త్వం తీసుకువచ్చిన ఫ్రీ హోల్డ్, గ్రిడ్ పాలసీ ద్వారా రూ.574 కోట్ల ఆదాయం వచ్చే చోట రూ.10,776 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానా కు వచ్చేలా పాలసీని రూపొందించామన్నారు.

ప్రతిపక్షాలు ప్రభుత్వానికి లేఖ రాస్తే 2014 నుంచి నేటి హిల్ట్ పాలసీ వరకూ ఏ ఏజెన్సీ ద్వారా అయినా ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాలుష్యకారక పరిశ్రమలను రింగ్ రోడ్ బయటకు తరలిస్తూ నగరంలో డీజిల్ బస్సులను దశల వారీగా హైదరాబాద్ అవతలికి తరలిస్తూ.. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నాం. ఎస్టీపీల ద్వారా డ్రైనేజీ కాలువల నీటిని శుద్ధి చేస్తున్నాం. ఈ నగరాన్ని మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని కాపాడేందుకు హిల్ట్ పాలసీ తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం చెప్పారు.