calender_icon.png 8 January, 2026 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశ్రామిక భూ బదిలీ విధానంతో సత్ఫలితాలు

07-01-2026 01:33:33 AM

సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లుపై మంత్రి ఉత్తమ్ ధీమా

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న పారిశ్రామిక భూ బదిలీ విధానం సత్ఫలితాలు ఇవ్వబోతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై ఆయన ప్రసంగిస్తూ.. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం గేమ్ చేంజర్ కాబో తుందని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఈ బిల్లుపై స్పష్టమైన వైఖరి ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.

లీజు హక్కులు ఉన్న భూములకు కొత్త చట్టం వర్తించదని, పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు కలిగిన భూములకు మాత్రమే వర్తిస్తుందని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రప్రభుత్వం రూ.౫.౦౯ లక్షల ఎకరాలను దారి మళ్లించేందుకే ఈ విధానం అమలు చేస్తున్నారనే ప్రతిపక్షాల విమర్శలపై ఆయన మండిపడ్డారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన పరిశ్రమ భూములు ఇప్పుడు ప్రజలకు నివాసయోగ్యంగా లేకుండా ఉన్నాయని, అలాంటి దుర్భర పరిస్థితులను సరిదిద్దేందుకే ప్రభు త్వం కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చిందని తెలిపారు.

హైదరాబాద్‌తో తనకు అవి భాజ్యమైన అనుబంధం ఉందని, ఒకప్పుడు నగర శివారులో వ్యవసాయ భూములు కుడా ఉండేవని గుర్తుచేసుకున్నారు. కాలుష్యం కారణంగా ఇప్పుడు జలాలు రంగుమారాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిశ్రమలను తరలించే ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. అందుకు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నాన్నారు.