31-07-2024 02:18:33 PM
హైదరాబాద్: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. పదేళ్ల పాటు మంచి పదవులు ఇచ్చి గౌరవించామన్నారు. కాంగ్రెస్ లో పదవులు అనుభవించి బీఆర్ఎస్ లోకి వెళ్లారని ఆరోపించారు. ఇంటికెళ్లి బతిమాలినా మీ స్వార్థం కోసం వెళ్లిపోయారని విమర్శించారు. ఇంకా ఏం మొహం పెట్టుకుని సీఎం గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ పడాల్సింది మేము, ఆవేదన చెందాల్సింది మేము అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.