31-07-2024 01:40:55 PM
హైదరాబాద్: సబితక్క నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వ్యక్తగతంగా జరిగిన సంభాషణ సభలో చెప్పారు. సబిత సభలో ప్రస్తావించారు కాబట్టే.. అప్పుడు జరిగిన పరిణామాలు సభలో చెప్పాలన్నారు. 2019లో మల్కాజిగిరిలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరిందన్నారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క మాట ఇచ్చారని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే బీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి తీసుకున్నారని వెల్లడించారు. తమ్ముడిగా నన్ను మోసం చేశారు కాబట్టే కేటీఆర్ ను నమ్మవద్దని చెప్పానని సీఎం పేర్కొన్నారు. నేను చెప్పింది నిజమో,, కాదో సబితక్క గుండెమీద చేయి వేసుకుని చెప్పాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు.