17 March, 2026 | 3:36 AM

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

17-03-2026 02:18 AM
  1. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై నిలదీయాలి
  2. ఆరు గ్యారంటీల మోసాలపై ప్రశ్నించాలి
  3. అస్త్రశస్త్రాలతో శాసన సభకు సిద్ధమైన బీఆర్‌ఎస్ ఎల్పీ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 16(విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజాసమస్యలపై నిలదీసేందుకు బీఆర్‌ఎస్ ఎల్పీ సిద్ధమైంది. అలాగే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, -యూరియా కొరత -యాప్‌తో రైతులు పడుతున్న కష్టాలు, కరెంటు, సాగునీరు సరిగా అందక ఎండుతున్న పంటలు, -రుణ మాఫీ పంట బోనస్ పెండింగ్ బకాయిలు, రైతు భరోసా, రైతు ఆత్మహత్యలపై మాట్లాడాలని బీఆర్‌ఎస్ సభ్యులకు అనేక సూచనలు చేసింది.

గల్ఫ్‌లో యుద్ధ నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత, -ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులపై మాట్లాడనున్నారు. వందరోజుల్లో అమ లు చేస్తామన్న గ్యారంటీలు.. రెండేళ్ల పాలన పూర్తయినా అమలు కాని తీరు, -అన్ని వర్గాలకు జరిగిన మోసాలపై సర్కారును ప్రశ్నించనున్నారు. మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రియల్ ఎస్టేట్ దందా, -పేద, మధ్యతరగతి ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్న తీరును కూడా ప్రస్తావిస్తామని చెప్పారు.

సింగరేణి టెండర్లలో అవినీతి, -కొందరికే కాంట్రాక్టు లు దక్కేలా మారిన నిబంధనలు సంస్థను నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సభలో వెల్లడించాలని బీఆర్‌ఎ స్ నేతలు నిర్ణయించుకున్నా రు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూ ముల స్వాధీనం పేరిట పేదల ఇండ్లను కూ ల్చి, వందలాది కు టుంబాలను రోడ్డుపాలు చేసిన వ్యవహా రంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

హిమాయత్ సా గర్ పరిధిలో పర్యావరణ వి ధ్వంసం, నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుస్తున్న సీఎం, మంత్రుల అనుయాయుల క్రషర్లు, క్వారీల మోసాలను నిండు సభలో ఎండగట్టనున్నారు. నిరుద్యోగులకు జాబ్ కేలండర్ ప్రకారం ఇవ్వాల్సిన ఉద్యోగ నోటిఫికెషన్లలో జాప్యంపైనా, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపైనా,  -ఐదు డీఏలు, పీఆర్‌సీ చెల్లింపులో ఆలస్యంపైనా, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిల విడుదలలో నిర్లక్ష్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సన్నద్ధమయ్యారు.

సాగునీటి ప్రాజెక్టులపై, విద్యా కమి షన్ నివేదికవ్ల -విద్యారంగంలో కలిగే దుష్పరిణామాలపై, గురుకులాల నిర్వహణలో ప్రభు త్వ వైఫల్యం, -126కి పైగా విద్యార్థుల మరణాలపై, గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ తీసుకున్న నిర్ణయంలో అశాస్త్రీయతపై చర్చించాలని అన్నారు. హైడ్రా విపరీత పోకడలు, -పేదల ఇళ్లపై ప్రతాపం, -బుల్డోజర్ పాలనపై గళమెత్తి, ప్ర భత్వాన్ని ఇరుకున పెట్టడానికి గులాబీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు.

రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు -శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం, ఫీజు రీ యింబర్స్‌మెంట్ చెల్లింపును పెండింగ్‌లో పెట్టడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలపై అసెం బ్లీ సమావేశాల్లో చర్చకు పెడతామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా -బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలపై  పెట్టిన తప్పుడు కేసులపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. భూ భారతితో ఇబ్బందులు, -నిషేధి త జాబితాలో లక్షలాది ఎకరాలు చేర్చడంతో భూముల క్రయ విక్రయాలపై ప్రభావం గురిం చి, ఆర్టీసీ, ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో నిర్లక్ష్యంపై ప్రశ్నించనున్నారు.