9 May, 2026 | 12:43 PM

Breaking News

ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   స్వీయ గణనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి   •   వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగించాలి   •  

కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..

17-03-2026 10:52 AM

హైదరాబాద్: సోమవారం అర్ధరాత్రి సమయంలో కూకట్‌పల్లిలో(Kukatpally) భారీ దోపిడీ జరిగింది. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళనలకు దారితీసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, బహదూర్‌పురకు చెందిన ఖుస్రూ, అజీముద్దీన్‌గా గుర్తించబడిన ఇద్దరు వ్యక్తులు, భారీ మొత్తంలో నగదును(Cash Robbery) తీసుకువెళ్తుండగా, గుర్తుతెలియని దుండగులు వారిని లక్ష్యంగా చేసుకున్నారు. నలుగురు అనుమానితులు బైకులపై వచ్చి బాధితులపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. డబ్బులు తరలిస్తున్న వ్యక్తుల కళ్లలో దుండగులు కారం కొట్టి దోపిడీ చేశారు

ఆ తర్వాత సుమారు కోటి రూపాయల నగదుతో పారిపోయారు.డబ్బును బహదూర్ పురా నుంచి జీడిమెట్లకు(Bahadurpura to Jeedimetla) తరలిస్తున్నట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే కూకట్‌పల్లి పోలీసులు(Kukatpally Police) ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితులను గుర్తించి పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దోపిడీకి గురైన నగదుకు హవాలా లావాదేవీలతో సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కూకట్ పల్లి పరిసరాల్లో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్(CCTV footage)ను పరిశీలిస్తున్నారు. భారీగా డబ్బులు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసును బహుళ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.