25 July, 2026 | 1:04 PM

గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌పై డిప్యూటీ సీఎం సమీక్ష

27-06-2024 02:16 PM

విజయవాడ: ఆర్.డబ్ల్యూ.ఎస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు లేని గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్‌కల్యాణ్‌ సూచించారు. కేంద్ర జల్‌జీవన్‌ మిషన్‌ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. జల్‌ జీవన్‌ పథకం అమలు, నిధులపై వివరాలు ఇవ్వాలని పవన్ ఆదేశించారు.