కేసీ వేణుగోపాల్‌తో కాంగ్రెస్ నేతల భేటీ.. కాసేపట్లో ఢిల్లీకి భట్టి
27-06-2024 03:23 PM
న్యూఢిల్లీ : గత నాలుగు రోజులుగా రాష్ట్ర ముఖ్యంత్రి రేవంత్ రెడ్డితో సహా పలుమంత్రులు ఢిల్లీలోనే మకాం వేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పలు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. గురువారం రాత్రి కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భేటీకానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ భేటీ హాజరుకానున్నారు. కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరనున్నారు. పీసీసీ అధ్యక్షులు, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు భర్తీపై మంత్రులతో కలిసి కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది.






