calender_icon.png 24 February, 2026 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామయ్యలకు పెళ్లిపిలుపు

24-02-2026 12:20:04 AM

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, నటుడు అల్లు శిరీష్ త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. మార్చి 6న నయనికతో ఆయన వివాహం జరగనుంది. దీంతో పెళ్లి శుభలేఖల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి మేనమామ మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను కలిసి తొలి కార్డును అందజేశారు శిరీష్.

తాజాగా తన తల్లిదండ్రులతో కలిసి నాగబాబు దంపతులు, పవన్ కళ్యాణ్ దంపతులను కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను శిరీష్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. మావయ్యలు తన పెళ్లి పట్ల ఎంతో ఆనందంగా ఉన్నారని, వారి ఆశీస్సులు తనకు ఎంతో ముఖ్యమని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ పోస్టుకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.