28 April, 2026 | 3:03 AM

డిప్యూటీ సీఎం పీఏ మృతి

28-04-2026 12:53 AM
  1. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన మధుసూదన్
  2. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన, సీఎం రేవంత్‌రెడ్డి ,భట్టి విక్రమార్క

ఖమ్మం, ఏప్రిల్ 27(విజయక్రాంతి): ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం మ ధ్యాహ్నం చాతి నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కార్డియాక్ అరెస్టు కావడంతో సమీపంలోని అ పోలో ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికి త్స నిర్వహిస్తున్న సమయంలో మరో మారు కార్డియాక్ అరెస్ట్ కావడంతో మధుసూదన్ మృతి చెందారు.తన వ్యక్తిగత సహాయకుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతికి గురైయ్యారు. ఎలా చనిపోయారనే విషయాన్ని కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. అత్యంత నిజాయితీ గల పాత్రికేయన్ని కో ల్పోవడం బాధాకరం గా ఉందని ఆయన అ న్నారు. వృత్తిపట్ల అద్దం అత్యంత నిబద్ధత కలిగిన పాత్రికేయుడని ఉ పముఖ్యమంత్రి చె ప్పారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబా నికి ఆత్మస్థైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

నిబద్ధత కల్గిన జర్నలిస్ట్ గా..

మధుసూదన్ నిబద్దత కలిగిన సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆయన గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా కీలక బాధ్యత వహించా రు. గతంలో ఖమ్మం ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ గా పది సంవత్సరాల పాటు పనిచేశారు. విధి నిర్వహణలో నిక్సాన పాత్రికేయుడిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.