8 August, 2026 | 4:22 PM

బాధితురాలిని పరామర్శించిన డిప్యూటీ మేయర్

08-08-2026 02:28 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ సుభాష్ నగర్‌ లో జంగం రాజమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో దొంగతనానికి చొరబడి, ఆమెపై దాడి ఘటన గూర్చి స్థానిక కార్పొరేటర్ బోట్ల శ్యామల- కిరణ్ సమాచారం మేరకు ఘటనలో తీవ్రంగా గాయపడి నగరంలోని  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జంగం రాజమ్మను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా వారు బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆమెకు మరియు ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాజమ్మకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి డాక్టర్లకు సూచించారు. అనంతరం బాధితురాలికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడికి తెగబడటం అత్యంత దారుణమని, నిందితుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల-కిరణ్,  వైద్య సిబ్బంది, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.