8 August, 2026 | 3:37 PM

నిర్మల్ విద్యార్థికి ఐదవ ర్యాంక్

08-08-2026 02:07 PM

నిర్మల్ ,ఆగస్టు 8 ( విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్‌కు చెందిన బి.ఎస్సీ (MPC) విద్యార్థి గుగ్లావత్ శేఖర్ ఇటీవల నిర్వహించిన CPGET (Common Post Graduate Entrance Test)లో రసాయన శాస్త్రం విభాగంలో రాష్ట్రస్థాయిలో ఐదవ ర్యాంక్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్ తెలిపారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచడం కళాశాలకు ఎంతో గర్వకారణమని అన్నారు. రైతు కుటుంబంలో జన్మించిన శేఖర్, తండ్రి లింబాజీ ప్రోత్సాహంతో, నిర్మల్‌లోని ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగించారని తెలిపారు.

కష్టపడి చదవడం, క్రమశిక్షణ, నిబద్ధతతో ముందుకు సాగితే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని శేఖర్ తన ప్రతిభతో నిరూపించారని ప్రిన్సిపాల్ అభినందించారు. శేఖర్ సాధించిన ఈ విజయంపై కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకులు అర్చన, డా. సూర్యా సాగర్, రమేశ్ రెడ్డి తో పాటు ఇతర అధ్యాపకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.