05-07-2025 12:00:00 AM
నిలిచిన రైళ్ల -రాకపోకలు
మహబూబ్‌నగర్‌లో ఘటన
మహబూబ్‌నగర్, జూలై 4 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి గేటు వద్ద శుక్రవారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలులోని ఆరో భోగికి సంబంధించి నాలుగు పట్టాలు తప్పడంతో గమనించిన లోకో పైలట్ రైలును ఆపివేశారు. ఇక్కడ ఎలాంటి నష్టం జరగకపోయినప్పటికీ చెన్నై ఎక్స్‌ప్రెస్, వందే భారత్‌తో పాటు బెంగళూరు, తిరుపతి, వివిధ దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. గూడ్స్ రైలు మళ్లీ పట్టాలు ఎక్కించేందుకు రైల్వే అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గంటల తరబడి ఆయా ప్రాంతాల్లో పట్టాలపైనే పలు రైళ్లు ఆగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.