కూరగాయల వ్యాపారులకు ప్రత్యేక స్థలం ఏర్పాటు
వ్యాపారులు కేటాయించిన స్థలాల్లోనే విక్రయాలు జరపాలి...
రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్...
బాన్సువాడ, ఆగస్టు 14 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చెరుస్తా నుంచి పాత బాన్సువాడకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు ప్రత్యేకంగా స్థలం కేటాయించే చర్యలు మున్సిపల్ అధికారులు శుక్రవారం చేపట్టారు. రోడ్డు పక్కన వ్యాపారాల కారణంగా ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా, వ్యాపారులకు కూడా సౌకర్యంగా ఉండేలా ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులతో కలిసి ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఒకే చోట వ్యాపారాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తే రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు, వ్యాపారులకు సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.వ్యాపారులు అందరూ తమకు కేటాయించిన స్థలాల్లోనే విక్రయాలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.






