తెలంగాణ మీసేవ హనుమకొండ జిల్లా అధ్యక్షులుగా దేశిని రమేష్ గౌడ్ ఎన్నిక
29-06-2025 08:45 PM
హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ మీసేవ ఫెడరేషన్(Telangana Meeseva Federation) అధ్యక్షులు బైరి శంకర్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కమిటీని ప్రకటించారు. హనుమకొండ జిల్లా అధ్యక్షులుగా దేశిని రమేశ్ గౌడ్, జనరల్ సెక్రెటరీగా జక్కుల రవి, ట్రెజరర్ గా సురేందర్ లను ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ... హనుమకొండ జిల్లాలో మీసేవ ఆపరేటర్ల సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం కోసం జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని నూతన కార్యవర్గాన్ని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు దేశిని రమేష్ గౌడ్ ను, కార్యవర్గాన్ని ఘనంగా రాష్ట్ర నాయకులు సన్మానించారు.






