10 July, 2026 | 1:51 AM

విద్యతోనే అనుకున్న లక్ష్యాలు సాధ్యం

10-07-2026 12:57 AM

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట, జూలై 9 (విజయక్రాంతి) : విద్యతోనే ఏదైనా సాధ్యమని విద్యార్థులు కష్టపడి చదవడం ద్వారానే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం సాధ్యపడుతుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పి బాలుర హైస్కూల్లో సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, 48 వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న ఆర్థిక సహకారంతో పాఠశాలకు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేలా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో, వసతి గృహాల్లో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు బలమైన పౌష్టికాహారాన్ని అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని వివరించారు. ఇప్పటికే స్ప్రెడ్ ఇండియా సహకారంతో పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన అన్ని రకాల అవసరాలను తీర్చేలా సహకరిస్తున్నామని గుర్తు చేశారు. 

ప్రస్తుతం పాఠశాలకు అవసరమైన డిజిటల్ బోర్డులు, ఎలక్ట్రికల్ బెల్ తో పాటు అవసరమైన సహకారం తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, వల్లాస్ దేవేందర్, పిల్లల రమేష్ నాయుడు, తండు శ్రీనివాస్ గౌడ్, అరవింద్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.