13 April, 2026 | 12:56 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

పచ్చని అడవిలో రహదారి నిర్మాణంతో విధ్వంసం

14-02-2026 12:48 AM
  1. అటవీ ఆక్రమణలపై స్పందించండి 

అటవీశాఖ అభివృద్ధి చైర్మన్‌కు ఫిర్యాదు

మణుగూరు, ఫిబ్రవరి 13,(విజయక్రాంతి) :అటవీశాఖ అధికారులు ఇసుక బినామీ లతో కుమ్మకై ఇష్టానుసారంగా పచ్చని చెట్లను తొలగించి అడవిలో అక్రమంగా రోడ్డును నిర్మించారని, ఇసుక లారీల కోసం పచ్చని అడవిని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ శుక్రవారం రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ పొదేంవీరయ్యకు పిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ, అడవులను రక్షించాల్సిన క్షేత్రసాయి అటవీ అధికారులే అక్రమార్కు లతో చేతులు కలిపి దండుకుంటున్నారని ఆరోపించారు.ప్రభుత్వాలు హరితహారం కోసం వేల కోట్లు ఖర్చు చేసి అడవులను సం రక్షించేందుకు చర్యలు చేపడుతుంటే అటవీ అధికారులు మాత్రం అడవులకు కాలాయములై భా వితరాలభవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నారని విమర్శించారు.

పాత రహదారి అంటూ కోర్టుని, చట్టాన్ని సైతం పక్కదారి పట్టించి అక్రమానికి అటవీ అధికారులు మార్గం ఏర్పాటు చేశారని, వందలాది చెట్లను నరికి విధ్వంసం గూరించి గౌరవ న్యాయస్థానానికి చెప్పకుండా పక్కదారి పట్టించారని ధ్వజమెత్తారు. ఈ అంశంపై న్యాయ పోరాటానికి దిగనున్నట్లు వివరించారు అడవిని ధ్వంసం చేసిన వారిపై చట్ట రీత్యా చర్య లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మండలి సభ్యులు ఎండీ షబానా, కోరి శ్యామల, డేరంగుల సుజాత, రెడ్డీ బోయిన రేణుక, కన్నాపురం వసంత, కన్నాపురం శైలజ, హేమలత పాల్గొన్నారు.