3 September, 2026 | 8:24 AM

వివరాలు పక్కాగా నమోదు చేయాలి

27-11-2024 | 04:00am

భీమదేవరపల్లి, నవంబర్ 26: సమగ్ర సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో తప్పులు లేకుండా నమోదు చేయాలని హనుమకొండ కలెక్టర్ పీ ప్రావీణ్య సిబ్బందిని ఆదేశించారు. భీమదేవరపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్‌లైన్ చేస్తున్న వివరాలను ఆమె పరిశీలించారు. అనంతరం మోడల్ స్కూల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో జంక్షన్ అభివృద్ధి, సందరీకరణ పనులను పరిశీలించారు.