19 August, 2026 | 7:33 PM

బోనస్‌ వంగడాల వివరాలు సెప్టెంబర్‌ 10లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి

19-08-2026 06:58 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం సిఫారసు చేసిన ఏడు రకాల వరి వంగడాలను సాగు చేసిన రైతులు క్వింటాలుకు రూ.500 బోనస్ పొందేందుకు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి సాయి కిరణ్ తెలిపారు.రైతులు విత్తనాలను కొనుగోలు చేసిన సంబంధిత డీలర్‌ వద్ద పంట వివరాలను నమోదు చేయించుకోవాలి. ప్రభుత్వ సంస్థలు, రీసెర్చ్‌ స్టేషన్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు సంబంధిత ధృవీకరణ పత్రాన్ని వ్యవసాయశాఖ అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ఏవో సాయి కిరణ్ తెలిపారు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే క్వింటాలుకు రూ.500 బోనస్‌ అందుతుందని స్పష్టం చేశారు. నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్‌ 10 వరకు ఉంటుందని పేర్కొన్నారు. బోనస్‌కు అర్హమైన ఏడు రకాల వంగడాలు బిపిటి 5204, ఆర్ఎన్ఆర్ 15048,  కేఎన్ఎం 1638, జైశ్రీరామ్,  హెచ్ఎంటి, కేఎన్ఎం 7715,  డబ్ల్యూజియల్ 44 ఉపయోగించాలన్నారు. రైతులు పట్టా పాస్‌బుక్‌,ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌ వెంట తీసుకెళ్లి వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి సాయి కిరణ్ సూచించారు.