2 July, 2026 | 10:34 AM

Breaking News

హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దు: సీఐ

02-07-2026 09:51 AM

బోథ్, జూలై 2(విజయక్రాంతి): వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని బోత్ సిఐ గురుస్వామి పేర్కొన్నారు. బుధవారం రాత్రి మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో వాహన వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో వాహనాలు నడిపేవారు తప్పనిసరి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు తాగి వాహనాలు నడిపితే కేసులు తప్పవని పేర్కొన్నారు గంజాయి సైబర్ నేరాల గురించి గ్రామస్తులకు వివరించారు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు సమావేశంలో న్యాయవాది పంద్రం శంకర్ ఉపసర్పంచ్ ఆత్రం మోహన్ వార్డు సభ్యులు  నీలాకాంతరావు అనిల్ కుమార్ దేవరావు షేక్ రాములు ఉన్నారు