అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్‌కు రెండు కళ్లలాంటివి
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీకి రెండు కన్నులాంటిలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే న్యాయని రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ 57వ డివిజన్ వాజ్ పాయ్ కాలనీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి జిల్లా మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ కు దీటుగా వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత పాలకులు నిర్లక్ష్యంతో వరంగల్ నగరం 20 ఏళ్లు వెనుకబడిందని అన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సంక్షేమం పథకాల అమలులో పార్టీలకతీతంగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ నేతలకు ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెపుతున్నారని ఆరోపించారు. అంబేద్కర్ జంక్షన్ నుండి వడ్డేపల్లి చర్చి వరకు మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగా సెంటర్ లైటింగ్ తో రోడ్డు వెడల్పుల పనులకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి సమ్మయ్య నగర్ వరకు రోడ్డు ఇరువైపులా సైడ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి వర్షాకాలంలో ఇబ్బందులు తలకితకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గోకుల్ నగర్ జంక్షన్ వద్ద గల సివిల్ సప్లై పోదాంలను పరిశీలించారు రానున్న రోజుల్లో గోదాముల నగర శివారులో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. 57వ డివిజన్ కు కార్పొరేటర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బంక సరళను మొట్టమొదటిసారిగా ప్రకటించారు. మొదట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి రెండ్ల శ్రీనివాస్, బిజెపి పార్టీ నుండి బొంగ కనకలక్ష్మి ల ఆధ్వర్యంలో వందమంది యువత, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారికి ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఈ.వి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బంక సంపత్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు బంక సతీష్, సీనియర్ నాయకులు బర్ల అనిల్ కుమార్, చిలువేరు పాల్సన్, చంద్రశేఖర్, చంద్రమౌళి, శంకర్, మురళి, చేరాలు, సందీప్, శ్రీనివాస్, లలిత, మౌనిక, పద్మ, విజయ, బిక్షపతి, డివిజన్ కాలనీ పెద్దలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




