20 April, 2026 | 2:38 AM

మహనీయుల తత్వం మతం కాదు.. మానవత్వం

20-04-2026 12:33 AM

మైనార్టీల ఆధ్వర్యంలో మహనీయుల జాతర గోడపత్రిక ఆవిష్కరణ

చేవెళ్ళ ఏప్రిల్ 19(విజయక్రాంతి): కుల మతాల కన్నా మానవత్వం గొప్పదని, మహనీయులు సూచించిన మార్గాల్లో పయనించాలని ఆంధ్రప్రదేశ్ మాజీ వక్ బోర్డు మాజీ చైర్మన్ ఖాదర్ భాషా అన్నారు. ఈనెల 30న నిర్వహించ తలపెట్టిన మహనీయుల జాతరకు సంబంధించిన గోడపత్రికను ఆదివారం చేవెళ్ల మైనార్టీల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కుల, మతాల కన్న మానవత్వం గొప్పదన్నారు.

మనుషులందరు సమానం అనే విషయాన్ని అందరు పాటించాలన్నారు. చదువుకున్నప్పుడే అందరు ఎదుగుతారని, అందుకే అంబేడ్కర్ అందరికి చదువు ఇవ్వాలని కోరుకున్నాడన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్  లాంటి మహనీయుల ఆశయాల సాధన కోసం అందరం కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహనీయుల కమిటీ చైర్మన్ బురాన్ ప్రభాకర్, సిరాజుద్దీన్, అబ్దుల్ జబ్బార్,హాజీ, ఖాజా పాషా, ఖాలెద్, మహమూద్, జాహెద్, చాన్, రెహ్మాన్, ఖదీర్ పాషా, చోటు, సలీం, అఫ్జల్, కలిమ్ , షరీఫ్, గఫూర్, మహనీయుల కమిటీ వైస్ చైర్మన్ మాచన్ పల్లి రామస్వామి,మొకరం రాజు, చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సున్నపు ప్రవీణ్, కమిటీ సభ్యులు బ్యాగరి ప్రభాకర్, మల్లెపల్లి శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.