12 April, 2026 | 7:36 PM

అభివృద్ధి నిరంతర ప్రక్రియ

14-11-2025 01:46 AM
  1. సీసీ రోడ్డు, డ్రైనేజీలు పనులకు ఎమ్మెల్యే కోరం శంకుస్థాపన

పట్టణంలో రూ. 65.70 లక్షల తో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఇల్లెందు, నవంబర్ 13,(విజయక్రాంతి):అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియనే ఒక్క రోజుతో ముగిసేది కాదని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోన 7,15,16,17,18,22 వార్డులలో డీఎంఎఫ్ టీ నిధులు రూ 65.70 లక్షలతో సిసి రోడ్డు, డ్రైనేజీ తదితర అభివృద్ది పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తుచేశారు.

ఇది వరకు కాలనీలలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ వసులు వేగంగా సాగుతున్నా యన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, అన్ని రంగాల్లో ఇల్లందును అభివృద్ధి పరచాలన్నడే తన సంకల్పదని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే వెంట ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డ డేనియల్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు దమ్మలపాటి వెంకటేశ్వరరావు, అనసూయ, మాజీ మంచిపల్ వైస్ చైర్మన్ జానీ పాషా, నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం తదితరులు పాల్గొన్నారు.