01-02-2026 02:51:40 AM
కార్పొరేటర్లు నర్సింహారెడ్డి, నవజీవన్‌రెడ్డి
ఎల్బీనగర్, జనవరి 31 : రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యమని కార్పొరేటర్లు కొప్పుల నర్సింహరెడ్డి, నవజీవన్ రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సహారా స్టేట్స్ రెండో గేటు ప్రధాన రహదారి పనుల్లో భాగంగా రూ, 2.5 లక్షల నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును శనివారం సహారా స్టేట్స్ కాలనీ సంక్షేమ సభ్యు లు, స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సహారా స్టేట్స్ కాలనీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు సయ్యద్ జానీ, సుదర్శన్ రెడ్డి, ప్రభాకర్, రాఘవేంద్ర, రవిచంద్ర, ఓపీ సింగ్, స్థానికులు జనార్దన్, మురళీ గౌడ్, సత్యపాల్ రెడ్డి, యాదయ్య, బీజేపీ నాయకులు దామోదర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హయత్‌నగర్‌లో సీసీ రోడ్డు ప్రారంభం
హయత్ నగర్ డివిజన్లోని మధురానగర్లో దాదాపు రూ, 78 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీనివాస్, కాలనీ అధ్యక్షుడు అమలు నాయక్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు శ్రీశైలం గౌడ్, రవీందర్, కిరణ్, నరేష్ నాయక్, ప్రసాద్ సూర్య, బీజేపీ నాయకులు సూర్య, బాలు నాయక్, బీజేవైఎం అధ్యక్షులు అఖిలేష్, భరత్ పాల్గొన్నారు.