calender_icon.png 11 January, 2026 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

10-01-2026 01:12:56 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి జనవరి 9: పట్టణాలతో పాటు పల్లెలు కూడా అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా ప్రజాపాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపాలిటీలకు కావలసిన నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు.

ఎన్నడూ లేని విధంగా పట్టణాలు పల్లెలను తేడా లేకుండా సమాన ప్రతిపాదికన అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.  వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలుపొందిస్తే మరింత అభివృద్ధి సాధ్యమైతుందన్నారు. 2వ వార్డు కళ్యాణ్ నగర్ లో రూ. 50 లక్షలతో కాలువ పనులకు, 6వ వార్డు సిలార్ పల్లి,  తిమ్మరాశి పల్లి లో నూతన సబ్ స్టేషన్ 33/11kv శంకుస్థాపన , బలరాం నగర్ కాలనీలో రూ, 2.05 కోట్లతో సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్ పనుల ప్రారంభోత్సవం చేశారు.

రూ, 2 కోట్లతో  మహబూబ్నగర్ చౌరస్తా నుండి శివాజీ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన, పాత ఇరిగేషన్ ఆఫీస్ స్థలంలో రూ ,4 కోట్ల తో షాపింగ్ కాంప్లెక్స్ పనుల శంకుస్థాపన చేసారు. క్యాంప్ కార్యాలయంలో  ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి చేశారు. కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు బాలాజీ సింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, అశోక్ రెడ్డి, రమాకాంత్ షాన్వాస్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు